1. ఆశువుగా కవిత చెప్పడానికి అల్లసాని వారిని కాదు.
గొంతెత్తి పాడడానికి ఆమనిని కాదు.
పురివిప్పి ఆడడానికి నెమలిని కాదు.
మిమ్మల్ని మరిపించడానికి మణిరత్నాన్ని కాదు.
అయినా,
శ్రీకారం చుడుతున్నాను
శ్రీఖర నామ సంవత్సరాదినాడు
శ్రీజనుల సమ్మతితో …..
మావి చిగురు
వేప పువ్వు
కొత్త బెల్లం
పాత జ్ఞాపకం
వెరసి ఉగాది.
వాసంతం
వేడి గాల్పు
వాన చినుకు
మంచుదుప్పటి
వెరసి ఉగాది
సుఖః దుఃఖాలతీపి
కోపతాపాల కారం
గిల్లి కజ్జాల పులుపు
మంచి చెడుల చేదు
వెరసి ఉగాది.
నిన్నటి మరపు
నేటి తలపు
రేపటి వెలుగు
వెరసి ఉగాది.
2.చైత్రం చిగురుటాకులతో స్వాగతమిచ్చింది.
వైశాఖం వేడి సెగలు కక్కింది.
శ్రావణ సంధ్య పెళ, పెళ మెరిసింది.
భాద్రపదం పరువులు త్రొక్కింది.
ఆశ్వయుజం అర్రులు జాచింది.
కార్తీకానికై ఎదురు చూసింది.
మార్గశిరం శిరస్సు వంచింది.
పుష్యమి ప్రమోదం కలిగించింది.
మాఘమాసం మంచుదుప్పటి కప్పింది.
ఫాల్గుణం వచ్చింది, మరో సంవత్సరం తెచ్చింది.
Tuesday, April 5, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment